భర్తతో గొడవ.. అతడి నాలుకను నోటితో కొరికేసిన భార్య!

28-01-2023 Sat 10:06 | Offbeat
Advertisement
  • ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఘటన
  • మనస్పర్థలతో వేరేగా ఉంటున్న భార్య, భర్త
  •  నాలుకకు తీవ్ర గాయమైందన్న వైద్యులు
  • కొంతకాలం తర్వాత మాట్లాడే అవకాశం ఉన్నా స్పష్టత ఉండదన్న వైద్యులు
Advertisement
భర్తతో జరిగిన గొడవలో భార్య అతడి నాలుకను నోటితో కొరికేసింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఠాకూర్ గంజ్ ప్రాంతంలో జరిగిందీ ఘటన. తీవ్రంగా గాయపడిన బాధితుడిని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలోని ట్రామా సెంటర్‌లో చేర్పించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 

పోలీసుల కథనం ప్రకారం.. వీరిద్దరికీ మూడేళ్ల క్రితం వివాహమైంది. అయితే, ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఏడాది కాలంగా వేరేగా ఉంటున్నారు. ఆటో డ్రైవర్ అయిన బాధితుడు నిన్న రాధాగ్రామ్‌లోని భార్య వద్దకు వెళ్లాడు. అయితే, అతడు పిల్లల్ని కలవకుండా భార్య అడ్డుకుంది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం మొదలైంది. ఈ క్రమంలో భార్యను అతడు కోపంగా ఈడ్చిపడేసి దాడికి యత్నించాడు. అతడి నుంచి తప్పించుకునే క్రమంలో ఆమె అతడి నాలుకను నోటితో పట్టుకుని గట్టిగా కొరికిపడేసింది.

తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే అతడిని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీకి తరలించారు. అతడి నాలుక పైభాగం తీవ్రంగా దెబ్బతిందని మెడికల్ యూనివర్సిటీ ప్లాస్టిక్ విభాగం హెడ్ ప్రొఫెసర్ విజయ్ కుమార్ తెలిపారు. గాయాన్ని శుభ్రం చేసి కుట్లు వేసి నరాన్ని మూసివేసినట్టు చెప్పారు. శరీరంలోని ఇతర భాగాలతో పోలిస్తే నాలుకకు అయిన గాయం త్వరగా మానుతుందని, కాబ్టటి త్వరలోనే అతడు మళ్లీ మాట్లాడగలుగుతాడని పేర్కొన్నారు. అయితే, మాటల్లో స్పష్టత అంతగా ఉండకపోవచ్చన్నారు.
Advertisement
Uttar PradeshLucknowCrime NewsTongue

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more